అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ బిజెపి నేతలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైఎస్ వివేకాను హత్య చేసింది ఎవరో తెలియాలంటే సిబిఐ విచారణ జరగాలని కోరారు. గుండెపోటుకు గురైనట్లు చెప్పి గుండెల్లో పోటుపొడిచింది ఎవరో తెలుసన్నారు. వివేకా కుమార్తె సునీత సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు జగన్ వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు సిబిఐ తో విచారణ జరపాలని డిమాండ్ చేసి ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు.
సిఎఎకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్ రాజీనామా చేయాలని, అన్ని పథకాల విషయంలో ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అల వైకుంఠ పురములో సినిమా చూపిస్తున్నాడని ఎద్దేవ చేశారు. ఇక్కడ పులి అక్కడ పిల్లి అన్న చందంగా జగన్ తీరుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. జమ్మలమడుగు లో పులి, జగన్ దగ్గర పిల్లిలా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.