హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సికింద్రాబాద్ కోర్టు పోలీసులను ఆదేశించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ దిగువ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. తమ పరిధిలోకి రాదని.. సంబంధిత కోర్టుకు వెళ్లాలని సికింద్రాబాద్ కోర్టు తెలిపింది. దీంతో అఖిలప్రియ తరఫు న్యాయవాదులు… ఎంఎస్‌జే కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు రేపు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.