బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇప్పటికే కస్టడీ ముగియటంతో పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. అయితే, పోలీసులు అదనంగా సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ 395 అనే దోపిడి కేసును చేర్చటంతో ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదించారు. జీవితకాలం శిక్ష పడే కేసులో తాము నిర్ణయం తీసుకోలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అఖిలప్రియ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.