ఆళ్ళగడ్డ వైసీపీ నాయకులను,కార్యకర్తలను మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ హెచ్చరించారు. చాగలమర్రి పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన అఖిల ప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ లకు పోటీ చేసే అభ్యర్థులను పార్టీ మారాలని చాగలమర్రి ఎస్ ఐ పీరయ్య వేధిస్తున్నారని ఆరోపించిన అఖిల ప్రియ… భర్త భార్గవ్ ,తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డి తో కలిసి ధర్నా చేసింది. ఎస్ ఐ పీరయ్య వేధింపులకు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ ఎదుట ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.
మేము ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని, కానీ వైసిపి నాయకులు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని అఖిల ప్రియ ఆరోపించారు. అభ్యర్థులను ఎత్తుకుపోవటం, భయబ్రాంతులకు గురి చేయడం అలాంటివి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లో చేయండి… గెలుపో ఓటమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఎలక్షన్ కమిషన్, పోలీసులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండి ప్రజలన విశ్వాసాన్ని పొందాలని సూచించారు.