తన భర్త, కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి భూమ అఖిలప్రియ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కావాలనే కేసులు పెడుతున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.
అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. భార్గవ్ తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపిస్తూ… తన బంధువులు, తన ఇంట్లో సోదాలు చేస్తున్నారని అఖిలప్రియ మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలి, ప్రతిపక్షం లేకుండా చేయటంలో జగన్ బిజీగా ఉన్నారని ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య.