మాజీ మంత్రి భూమ అఖిలప్రియ పోలీసులపై ఫైర్ అయ్యారు. తన భర్త భార్గవ్‌ను వెంటాడి వేధిస్తున్నారని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బెంగుళూరు, తమ బంధువుల ఇండ్లపైకి పోలీసులు వెళ్లటాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
అయితే, అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఆళ్లగడ్డలో ఓ క్రషర్ వ్యాపారిపై దాడి చేసిన కేసులో తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు హైదరాబాద్‌లోని అఖిలప్రియ నివాసానికి వచ్చారు. సర్చ్ వారెంటు చూపించాలని, ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది.