హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది. ఆమెకు బెయిల్ ఇస్తూ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో అఖిలప్రియ శనివారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక, ఇదే కేసులో ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.