పోలీసులు హద్దుల్లో ఉండాలన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. కరీంనగర్ లో బండిసంజయ్ పై దాడి కి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఈ రోజు కాకపోతే రేపు అయినా చర్చలు జరపక తప్పదు. గొప్పలకు పోకుండా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు. పాలమూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేస్తే ఇక్కడ తెరాస ప్రభుత్వం మొత్తం తామే చూస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరో వైపు పురపాలక ఎన్నికలు వస్తుండటం తో ఒకే ఐటీ కారిడార్ కు రెండుసార్లు శంకుస్థాపనలు చేస్తూ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు డీకే అరుణ.