మాజీ మంత్రి డీకే అరుణ, మంత్రి నిరంజన్ రెడ్డిల పట్టుదలతో గద్వాల రాజకీయం వేడెక్కింది. జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసును గద్వాల నుండి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తికి తరలిస్తున్నారంటూ డీకే అరుణ మండిపడుతుంది.

జోగుళాంబ గద్వాల జిల్లాలోనే ముందు నుండి జూరాల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఉంది. కానీ ఇక్కడి నుండి మంత్రి తన సొంత నియోజకవర్గానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నరాంటూ డీకే అరుణ మండిపడ్డారు. ఏనాడు జూరాల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కార్యలయాన్ని వనపర్తికి తరలించడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గద్వాల ప్రాంతంపై వివక్ష చూపిస్తున్నారని… గద్వాల్, అలంపూర్ ప్రాంతాలలో వుండాల్సిన కార్యలయాలను పెబ్బేర్, వనపర్తికి తరలిస్తున్నట్లు ప్రతిపాధనలు తయారు చేశారని.. నీటిపారుదల శాఖలు ప్రధాన కార్యలయాలను 13 నుంచి 19 వరకు పెంచినప్పటికి గద్వాల లో వుండాల్సిన కార్యలయాని వనపర్తికి తరలించడం సరికాదని అన్నారు. గతంలో ఇంజనీరింగ్ కార్యలయాని తరలింపు ప్రస్తావన వచ్చినప్పుడు గద్వాల టిఆర్ఎస్ శాసనసభ్యుడు కృష్ణమెూహన్ రెడ్డి సైతం నిరాకరించారు. ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వనపర్తికి ఇంజనీరింగ్ కార్యలయాలు తరలించడంపై స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోరు మెదపటం లేదన్నారు.