హుజురాబాద్ లో నాలుగు ఓట్లుంటే చాలు లక్ష ఇచ్చేందుకు కూడా టీఆర్ఎస్ రెడీగా ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలాపురం మండలంలో పెఱిక ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన నా మిత్రుడు హరీష్ నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో దసరా పండుగ చేసుకునేందుకు మరో 20రోజులుంటే, హుజురాబాద్ లో మాత్రం నాలుగు నెలలుగా ప్రతి రోజు పండుగే అన్నట్లు చేశారన్నారు.
టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ లో గెలుపు కోసం చేస్తున్న ప్రచారాలు, ఇస్తున్న హామీలు చూసి ఇక్కడి ప్రజలు సిగ్గుపడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. నా రాజీనామాతో హుజురాబాద్ లో సర్పంచులు, ప్రజా ప్రతినిధుల బిల్లులు క్లియర్ చేస్తున్న మీరు మీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఇప్పటికే 2000కోట్లు ఖర్చు చేసిందని విమర్శించిన ఈటల, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మీకు సేవ చేసిన తనను ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రశ్నించే తత్వానికి ఊపిరిపోయాలని ఈటల పిలుపునిచ్చారు.