మాజీ మంత్రి, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయింది. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబరు ఇరవైన వేలం వెయ్యనున్నారు. మొత్తం రుణ బకాయిలు సుమారు 209 కోట్లు కాగా తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల 61 వేలు ఉండటంతో మిగతా బకాయిల కోసం వ్యక్తి గత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందంటు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెప్పటం తో సర్దుమణిగింది.వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తరనియోజకవర్గంలోని ని ఫ్లాట్ కూడా ఉన్నట్టు సమాచారం.