జవహర్, మాజీ మంత్రి
టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. ఆయన యాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పాదయాత్ర ప్రారంభం కాకముందే జగన్మోహన్ రెడ్డికి, ఆయన వర్గానికి, వైసీపీ నాయకులకు పాంట్లు తడిసిపోతున్నాయి. లోకేశ్ యాత్రను ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా అధికారుల స్థానచలనాలు ఏవిధంగా ఉంటున్నాయి? రాష్ట్రంలో రాజకీయం ఏవిధంగా మారబోతోంది అని ఆందోళనపడుతున్నారు.
జీవో నెంబర్ 1 ను అడ్డం పెట్టుకొని లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. జీవో నెంబర్ 1ను సాకుగా చూపి యాత్ర వివరాలు అడగడం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, అధికారులు భయపడుతున్నారనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. లోకేష్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలుకనున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బడుగు బలహీనవర్గాలవారు లోకేశ్ పాదయాత్రకై ఎదురుచూస్తున్నారు.
ప్రధానంగా యువత వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. లోకేష్ వస్తే వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకుగాను ఆయన చేస్తున్న యువగళం కార్యక్రమానికి గొంతెత్తి యువత అండగా ఉండడానికి వస్తోంది. డీజీపీ, పోలీసులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు ఉలిక్కి పడుతున్నారు. జీవో నెంబర్ 1ని సాకుగా చూపి అడ్డుకోవాలని చూస్తున్నారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరుగుతుంది.. జరిగి తీరుతుంది.
ఈ పాదయాత్రకు ఎవరూ పర్మిషన్ అవసరం లేదు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, యువత ఉపాధి కోసం, దళితుల రక్షణ కోసం, బడుగుల ఆత్మస్థైర్యం కోసం లోకేశ్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రను పెద్ద ఎత్తున ప్రజలు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాసుకోండి.. చూసుకోండి.. మీకు కళ్లుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారు. చెవులుండి చెవిటివారిలా చేస్తున్నారు. డీజీపీ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.