టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటు ఉందంటూ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 గంటల కరెంట్ ఇవ్వాలని సీఎంను కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా పనిచేసిన నేత ఇలా ఒక్కసారిగా నిర్వేదం వ్యక్తం చేయటం వెనుక ఏమై ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతంది.