ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. ప్రముఖులు వైరస్ బారినపడటం కలవరం రేపుతోంది. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాను కరోనా బారిన పడినట్టు స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు అని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు