సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి
ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి వచ్చారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయం అవుతోంది. స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు తెలియకుండానే ఈ తతంగం జరుగుతోందా..? వైసీపీ నేతల ధనదాహానికి వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి.
కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం అయింది. చిల్లకూరులో ఇప్పటికే 250 ఎకరాల ప్రభుత్వ భూమి ధారాదత్తం చేశారు. ఈ వ్యవహారాలపై ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. తహశీల్దార్ ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయలేదు.