తెలంగాణలో తొలి మహిళా కమిషన్‌ను ఎట్టటకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని నియమించింది. సభ్యురాళ్లుగా పద్మ (వరంగల్ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్), షాహీనా అఫ్రోజ్(హైదరాబాద్, మహబూబ్‌గంజ్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్), ఈశ్వరీబాయి(ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ), ఉమాదేవి యాదవ్ (మంచిర్యాల), సూదం లక్ష్మి (నిజామాబాద్), కటారి రేవతిరావు (పెద్దపల్లి)ని నియమించింది. నియమిత తేదీ నుంచి ఐదేళ్లపాటు వీరంతా తమ పదవిలో కొనసాగుతారు.
విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. నాటి ఉమ్మడి కమిషనే మూడేళ్లు కొనసాగింది. మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టులో వివాదం కూడా నడిచింది.హైకోర్టు ఆదేశాలతోనే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ హయాంలో.. 2010 నుంచి 2014 ఏప్రిల్ వరకు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డినే.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ కావడం విశేషం.