కొందరు స్వార్థపరులు కావాలనే పని గట్టుకొని మన్నలి ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత ఏడాది మనకు కలిసి రాలేదంటూ… పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తుమ్మల కామెంట్ చేశారు. సత్తుపల్లిలో ఈ సమావేశం జరిగింది. గంటపాటు తుమ్మల తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
రాజకీయాల్లో అటు పోట్లు, గెలుపు ఓటములు సహజమని కామెంట్ చేసిన తుమ్మల, ఓటమి గురించి ఆలోచించకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలన్నారు. తాత్కాలిక ఇబ్బందులు వచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. వేల మంది తన కోసం రావడం ఆనందం ఉందని, రాబోయే రోజుల్లో అండగా ఉంటానని పేర్కొన్నారు.
తుమ్మల పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కావటం మొదట ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ సమావేశంలో మనమంతా సీఎం కేసీఆర్ కు కొంతకాలం అండగా ఉండాల్సిన అవసరం ఉందని తుమ్మల కామెంట్ చేయటంతో పార్టీ మార్పు ఊహాగానాలకు తెరపడింది.