అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ వ్యక్తిగత హజరు మినహయింపు కోరటంపై అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి యనుమల. గతంలోనే సిబిఐ, హైకోర్టు దీనికి ఒప్పుకోలేదని, ఇప్పుడు మళ్ళీ జగన్ కొత్త డ్రామా ఆడుతున్నాడన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సాక్ష్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, చట్టం ముందు అందరు సమానమే అని గుర్తు చేసారు. సీఎం అయినంత మాత్రాన కోర్ట్ కి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలను తప్పు దోవపట్టిస్తూ ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తుంది మీరా కాదా అని అడిగారు. కొత్తగా మీడియా ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం మంచిది కాదని, ఎవరు తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకి తెలుసన్నారు యనమల.