ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలే కానీ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజ్యాంగంలో లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రభుత్వం ఎన్నికల మధ్యలో జోక్యం చేసుకోలేదన్నారు.
ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పలేదన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని తీర్మానం చేయడం కోర్టు ధిక్కరణే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో శాసన సభ పాత్ర ఏమీ ఉండదని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై చట్ట సవరణకు ఆర్డినెన్స్ చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో… రాజ్యంగపరమైన అంశాల్లో అసెంబ్లీకి సవరణ చేసే అధికారం లేదన్నారు. రాజ్యంగమే ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తినిచ్చిందన్న విషయం మరవరాదని సూచించారు.