సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీకాంలో ఫిజిక్స్ అంటూ అందరికీ సుపరిచితమైన నేతగా మారిపోయారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వైసీపీ నుండి గెలిచి, టీడీపీ తీర్థంపుచ్చుకున్న ఈ నేత ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా జలీల్ ఖాన్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీకు మంత్రి పదవి గాలికి వచ్చింది కాబట్టే...విలువ తెలియడంలేదని, ఎంపీ కేశినేని నానిపై నోరు పారేసుకునే అర్హత నీకుందా? అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కార్పరేటర్‌గా నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నంటూ ఛాలెంజ్ చేశారు.పోలీసులు లేకుండా మంత్రి వెల్లంపల్లి తన నియోజకవర్గంలో తిరగలేడాని, ఒక్క అభివృద్ధి పని కూడా చేయటం లేదని మండిపడ్డారు. ఇలా అయితే త్వరలో జనమే చెప్పులతో కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు వెల్లంపల్లికి మంత్రి పదవి నేను వేసిన బిక్షే, అది గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.