మేం ఇంట్లో లేనప్పుడు ఏ కొజ్జాగాడైనా ఇంటికి వస్తాడంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో జేసీ ఇంట్లోకి స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చి జేసీ అనుచరుడిపై దాడి చేయటంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న జేసీ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.
మా ఇంటికి మందినేసుకొని వచ్చారని.. కానీ ఆ సమయంలో మా ఇంట్లో కూడా మా అనుచరులుంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరూ లేరని తెలిసే మా ఇంటికి వచ్చాడని, కానీ స్థానిక ఎస్.ఐ మా ఇంటి గేటు ఎందుకు తీశాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఈ విషయంలో ఫిర్యాదు చేయమని, పోలీసులే సుమోటో కేసు పెట్టాలన్నారు.
పెద్దారెడ్డి నా ఇంటికి వస్తే తెలివిలేని వాడు… ఆ ఎస్.ఐ డోర్ తీస్తాడా అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కొడవలి పట్టుకొని మా ఇంటికొచ్చారని… నేను భయపడే వాడిని కాదన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇవన్నీ చేస్తున్నారని… నేను జైల్లో ఉండగానే నా ఇంటి నుండి నామినేషన్ పడింది, కానీ ఇప్పుడు భయట ఉన్నా ఎలా గెలుస్తారో చూద్ధాం అంటూ జేసీ సవాల్ విసిరారు.