పోలీసు అధికారులు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సజ్జలతో పాటు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నా భార్య సోదరుడు ప్రసన్నకుమార్‌రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే కేసుల్లేవు. నాకే బాధేస్తుంది. నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే, నేను ఏదో అన్నానని పోలీసు అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. నాకో న్యాయం?… నా బావమరిదికో న్యాయమా? జెండా ఒక్కటే డిఫరెన్స్. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్’ అని వ్యాఖ్యానించారు.
పోలీసు అసోసియేషన్ ఇంకెన్ని రోజులు సజ్జల చేతిలో ఉంటుంది, ఆయనేమైనా ఐఏఎస్ అధికారా…? సాక్షి పేపర్ లో కథలు రాసుకునే వాడు. కథలు రాసేవాడు పోలీసులను ఆదేశిస్తే.. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? అంటూ మండిపడ్డారు.