ఆర్టీసీ ఆస్తులు మెఘాకు కట్టబెట్టడం కోసం ఓ మంత్రి కీలకంగా పనిచేశారని ఆరోపించారు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. దీని వెనుక ఓ మంత్రి ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకపోయిందని, వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని.. .సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే… మాట్లాడకపోవటం సరికాదన్నారు మధుయాష్కీ.