ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై కార్మికులు వెనక్కు తగ్గిన నేపథ్యంలో కేసీఆర్ కార్మికులపై ఇంకా పంథానికి పోవద్దని సూచించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేసీఆర్ వాళ్లపై ప్రేమ చూపించి మిగిలిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. దిగివచ్చిన కార్మికులతో చర్చలు జరిపితే బాగుంటుద్దన్నారు. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లలో చాలా సహజమైన డిమాండ్లు ఉన్నాయి, ఒక్క తెల్ల రేషన్ కార్డ్ తప్ప మిగతా అన్ని కార్మిక చట్టం ప్రకారమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను పిల్లల్లా భావించాలని సూచించారు.
ఆర్టీసీ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదని ఇంకా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.