వైసీపీ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దళితుడైన వినోద్ కుమార్ ను వేధిస్తున్నారని ఆరోపించారు. సీఎం చెల్లెలు కులాంతర వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నాన్చుడు ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు హర్షకుమార్. దళితులను చంపేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న దళిత నేతలంతా ఏకమై.. జరుగుతున్న వివక్షపై జగన్ ను నిలదీయాలని కోరారు హర్షకుమార్.