తెలంగాణ అసెంబ్లీలో మాజీ ఎంపీ, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సందడి చేశారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన సీఎం కేసీఆర్, కేటీఆర్ ను కలిశారు. అంతేకాదు సీఎల్పీ కార్యాలయంలో తన పాత స్నేహితులను కలిసి సరదాగా మాట్లాడారు.
తాము తెలంగాణను వదిలి ఎంతో తప్పు చేశామని కామెంట్ చేసిన జేసీ, నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలవరని తాను చెప్పిన విషయాన్ని జేసీ గుర్తు చేశారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో రాజకీయాలు బాగున్నాయన్నారు. ఏపీని వదిలి తెలంగాణకు వచ్చేస్తానంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే హుజురాబాద్ లో గెలుపెవరిది అని ప్రశ్నించగా… అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో తనకు తెలియదన్నారు.