తాను గతిలేకే ప్రాంతీయ పార్టీలో ఉన్నానని… ఎప్పటికైనా జాతీయ పార్టీలే మంచివంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన… అక్కడున్న కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుతో మమ్మల్ని మెడపట్టి గెంటేశారని, ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్నారు. బ్రహ్మరాతతోనే ఆనాడు ఎలాంటి అర్హతలు లేకున్నా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను చూస్తే బాధేస్తుందన్నారు. జేసీతో భట్టి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
నేనే సీఎం… నేనే సీఎం అంటూ పార్టీని ఈ స్థాయికి తెచ్చారంటూ జేసీ కామెంట్ చేయగా, నేను కాదు అంటూ జీవన్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఇక ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటీ అని రాజగోపాల్ రెడ్డి అడగ్గా… ఇక ఏం చేయలేము అంటూ వ్యాఖ్యానించారు. అవును యుద్ధం చేయాల్సిన స్థితిలో కాంగ్రెస లేదంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.
ఇక షర్మీల పార్టీ వెనుక ప్రధాని మోడీ ఉన్నారంటూ జేసీ వ్యాఖ్యానిస్తూ… రాయలతెలంగాణ ఇస్తే కాంగ్రెస్ మెరుగ్గా ఉండేదని, కానీ అప్పుడు పొన్నం ప్రభాకర్, వివేక్ ఒప్పుకోలేదన్నారు.