తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ పై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు.వైట్ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒక సామాజిక కార్యకర్తగా మాత్రమే కాకుండా, పేరెంట్‌గా కూడా తాను మాదకద్రవ్యాలను వ్యతిరేకిస్తానని కొండా స్పష్టం చేశారు.
తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయిందని ఆరోపించారు కొండా. చాలా మంది ధనవంతులైన పిల్లలు డ్రగ్స్ తీసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం ఇప్పటికే సమాజమంతటా విస్తరించిందని, ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. ఇక నేరస్థులు డ్రగ్స్ ఉపయోగిస్తూ వారు మొత్తం సమాజానికి ప్రమాదకారులుగా మారుతున్నారని అన్నారు కొండా.
I am against drugs not only as a social activist, but also as a PARENT.
Drugs have become prevalent in Telangana.
Many rich kids are taking drugs and they are ruining their lives.
Now drugs are spreading across the society ruining families & society.https://t.co/pJxYD9hbJJ— Konda Vishweshwar Reddy (@KVishReddy) September 19, 2021
Advertisements
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని మీరు భావిస్తున్నారా అని ఒక నెటిజన్ కొండాను ప్రశ్నించగా.. ‘”నాకు తెలియదు. నేను ఎప్పుడూ అలా అనలేదు” అని స్పష్టం చేశారు. అయితే వైట్ చాలెంజ్ లో అందరూ పాల్గొనాలని .. అలాగే మిగిలిన వారికి చాలెంజ్ విసరాలని పిలుపునిచ్చారు కొండా.