గత ఎన్నికల ముందే టీఆర్ఎస్ ను వీడి పార్టీ మారుతారంటూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిపై ప్రచారం జరిగింది. కానీ ఆయన దాన్ని ఖండించారు. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఆనాటి నుండి పార్టీలోనే ఉన్నప్పటికీ అసంతృప్తిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఇప్పటికే అక్కడ గెలుపుకోసం పార్టీ చాలా రోజులుగా దృష్టిపెట్టిన నేపథ్యంలో… పొంగులేటి తన వర్గంతో ఖమ్మంలో తిరగాలంటే పాస్ట్ పోర్టు కావాలన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తనను ఈ మాటలు అన్నారన్నది బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ, ఎన్నికల ముందు పొంగులేటి నోరు విప్పటం చర్చనీయాంశంగా మారింది.
వ్యక్తులను టార్గెట్ చేయటం సరికాదని, కక్షతో తనను ఇబ్బందిపెడుతున్న వారే ఇబ్బందిడతారంటూ తన వ్యాఖ్యలను పొంగులేటి సమర్థించుకున్నారు.
ఎన్నికల సమయంలో పొంగులేటి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ లో హాట్ హాట్ చర్చ సాగుతుంది.