పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉన్నత విద్యా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకి వైస్ ఛాన్స్లర్ లను నియమించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్లర్ లను నియమించకుండా మొత్తం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిన అంశం మీద గౌరవ గవర్నర్ గారు పది రోజుల్లో వైస్ ఛాన్స్లర్ నియమించాలని చెప్పడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటిది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విజ్ఞతతో ఆలోచించి విద్యా వ్యవస్థను నాశనం చేయకుండా ఉండే ఆలోచనతో గవర్నర్ గారి మాటలను సానుకూలంగా తీసుకొని విమర్శలు, ప్రతి విమర్శలకు వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్నివిశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్ లను నియమించాలి. తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఉన్నత విద్యా వ్యవస్థని కాపాడడానికి అవకాశమే లేకుండా మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థ ని నాశనం చేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా గవర్నర్ గారి మాటలు గౌరవించి తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్స్లర్ లను మరియు అధ్యాపక వర్గాన్ని కూడా నియమించాలని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం.