ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారా? కేసీఆర్ కు అప్పట్లో అత్యంత సన్నిహితుడైన ఇప్పటి బీజేపీ నేత రవీంద్ర నాయక్ పార్లమెంట్ కు వెళ్లని కేసీఆర్ గురించి చెప్పారు. కొన్ని రోజుల పాటు కేసీఆర్ లోక్ సభ కు వెళ్లలేదని, చివరకు లోక్ సభ సభ్యత్వం రద్దు అయ్యే పరిస్థితి లో కూడా పార్లమెంట్ కు రాలేదని తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో చెప్పారు.
తప్పని పరిస్థితుల్లో ఒక ఎంపీ కేసీఆర్ సంతకాన్ని పెట్టారని, తప్పు అని తెలిసినా తెలంగాణ కోసం చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. ఇలా తెలంగాణ కోసమే కేసీఆర్ ను భరించమన్నారు. ఇంకా రవీంద్ర నాయక్ ఏం మాట్లాడారో కింది వీడియో లో చూడొచ్చు.