ఏ.వి. రమణ, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, గుంటూరు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని రాజకీయాలకు వాడుకొవడం వైకాపా బరితెగింపుకు నిదర్శనం. దైవ చింతనపై భయం లేకుండా టీటీడీ దేవస్థానం నగలు తరలించుకు పోయారంటూ నాడు ఆరోపించడం జగన్ ముఠా బరితెగింపుకు నిదర్శనం.
ఎన్నికల సమయంలో స్వామివారి నగలను సింగపూరుకు తరలించారని, అందులో పింక్ డైమండ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించడం క్షమించరాని నేరం. పింక్ డైమండ్ పోయిందంటూ తప్పుడు ప్రకటనలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించిన విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులుపై నాడు రూ. 200 కోట్లకు టీటీడీ ఈవో సింఘాల్ పరువు నష్టం దావా వేశారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, మాజీ ఈవోలు ఐ వి ఆర్ కృష్ణారావు, రమణాచారి పింక్ డైమండ్ ఎక్కడికీ పోలేదని వెల్లడించారు.
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆనాడు ఇష్టారాజ్యంగా, లెక్కలేనితనంగా పింక్ డైమండ్ పోయిందని అసత్య ప్రచారం చేసిన విజయసాయి రెడ్డి 5 కోట్ల ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలి. పింక్ డైమండు పేరుతో కోట్లాది వేంకటేశ్వరస్వామీ భక్తులకు ఆందోళన కలిగించినందుకు, ఆ దేవ దేవుణ్ణి రాజకీయాలకు వాడుకొన్నందుకు విజయసాయిరెడ్డి పశ్చాత్తాపం ప్రకటించాలి. వైసీపీ ప్రభుత్వ చర్యలతో వేంకటేశ్వరస్వామి ఏడుకొండలు దిగి కిందకు వచ్చేలా ఉంది.