కరోనా భయంతో జనం అల్లాడుతున్నారు. విదేశాలకు వెళ్లాలంటే ఓ సాహాసం చేయాల్సిందే. మరీ తప్పనిసరి అయితే తప్పా విదేశాలకు వెళ్లకండని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నాయి. బయటి నుండి వచ్చే విదేశీలకు వీసాలు నిరాకరిస్తూ… కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవల సౌదీ అరేబియా వెళ్లిన మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. వచ్చేప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ చేయించుకున్నా… కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది. అయినా… ఎందుకు అనుమానం అనుకున్నాడో, లేక ప్రజలకు అవగాహాన కల్పించాలి అనుకున్నారో కానీ తనను స్వీయ నిర్భందం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. 14 రోజుల పాటు సమాజానికి దూరంగా ఉండబోతున్నాడు.
కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే… సమాజానికి దూరంగా ఉండటం మంచిదని, అది కాస్త ఇబ్బందికరమైన అంశమే అయినా… తమ కుటుంబీకులు, తోటి వారిని కాపాడుకోవాలంటే ఎవరికి వారు దూరంగా ఉండటం ఉత్తమమని డాక్టర్లతో పాటు ప్రముఖులు ప్రజలకు విజ్ఙప్తి చేస్తూనే ఉన్నారు.
ఇటీవల ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన బృందంలో ఉన్న కమెడియన్ ప్రియదర్శి కూడా తనకు కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ… ముందు జాగ్రత్త చర్యగా తనను తాను స్వీయ నిర్భందం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.