నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ వీఆర్వోతో సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రెవెన్యూ విభాగంలో పనిచేసిన అనుభవంతో సులువుగా డబ్బు సంపాదన కోసం నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ వీఆర్వో మద్ది వెంకటరెడ్డితో పాటు కల్వచర్ల రఘు అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ ని, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్, 13జీ, సీ ఫారాలు, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహానీలు, కోటేషన్లు, బ్యాంకు చాలన్లు, గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్ట్ లకు సంబంధించి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను మీడియాకి వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన మద్ది వెంకటరెడ్డి 1973 సంవత్సరం నుండి 2012 వరకు రెవెన్యూ విభాగంలో పట్వారీ, పంచాయితీ కార్యదర్శి, వీఏఓ నెక్కోండ, పర్వతగిరి మండలాల్లో పనిచేసి పదవివిరమణ పోందాడని తెలిపారు. కానీ నిందితుడికి పదవీ విరమణ అనంతర కూడా సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. తాను రెవెన్యూ విభాగంలో సుధీర్ఘకాలం పని చేసిన అనుభవంతో నకిలీ పట్టాదారు పాస్ బుక్ లను, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్, 13జీ, సీ ఫారాలు తయారీకి తెర తీసాడు.
ఈ విధంగా తయారు చేసిన నకిలీ పాస్ బుక్ లు, పత్రాలపై మరో నిందితుడై కల్వచర్ల రఘుతో తహసిల్దార్, ఆర్టీఓ సంతాకలను ఫోర్జరీ సంతకాలు చేసేవాడు. ఈ విధంగా నకిలీ రెవెన్యూ పట్టదారు పాస్ బుక్ లు, పత్రాలను పొందిన వ్యక్తులు బ్యాంకుల నుండి రుణం పోందేవారు. ఈ వ్యవహరంపై అధికారులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ ఇద్దరి నిందితులపై నెక్కోండ, పర్వతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందని అదనపు డీసీపీ తెలిపారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు సరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లవణ కుమార్, నెక్కొండ, పర్వతగిరి ఎస్ఐలు ఫర్వీన్, దేవేందర్ తో పాటు టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సుందర్, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుల్ నాగరాజు, సృజన్, సురేష్, శ్యాం, శ్రీను, శ్రవణ్, నవీన్ లను అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.