విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస గ్రామానికి చెందిన తడ్డి కళావతి విశాఖలో పరీక్షకు హాజరైయ్యేందుకు ఓ పెద్ద సాహసమే చేసింది.
చిత్రావతి నదికి వరద రావడంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి… విశాఖలో పరీక్షకు హాజరు కావాలంటే… నది దాటక తప్పని పరిస్థితి ఏర్పడింది
సోదరుల సహకారంతో వారి భుజాలపై అత్యంత ప్రమాదకరంగా నదిని దాటిన ఆ యువతి అక్కడి నుంచి మరో వాహనంలో విశాఖ చేరుకొంది.
ఇంతటి వరద ఉన్న సమయంలో స్థానికుల సమస్యలను అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ యువతి సాహసం చేసి పరీక్షలకు హాజరుకావడంతో గ్రామస్తులు యువతి సాహసాన్ని కొనియాడారు