ఆవు గురించిన సైన్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారా ? దానికి సంబంధించిన ఎగ్జామ్‌లో పాల్గొనాలని అనుకుంటున్నారా ? అయితే మీకు కామధేను గౌ విజ్ఞాన్ ప్రచార్ అవకాశం కల్పిస్తోంది. ఆవు గురించిన ఎగ్జామ్‌లో మీరు పాల్గొనవచ్చు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్సలర్లకు సూచన చేసింది. దేశంలోని విద్యార్థులే కాకుండా ఎవరైనా సరే ఆవుకు సంబంధించిన ఎగ్జామ్‌లో పాల్గొనేలా ఆ విషయంపై అవగాహన కల్పించాలని సూచించింది.
కేంద్ర ఫిషరీస్, యానిమల్ హస్బండరీ అండ్ డెయిరీయింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీతోపాటు కాలేజ్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. పాల్గొన్నవారికి సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతోపాటు పౌరుల్లోనూ ఆవుల పట్ల, ఆవుల విజ్ఞానం పట్ల అవగాహనను పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నామని, దీన్ని ఏటా నిర్వహిస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ్‌భాయ్ కథిరియా తెలిపారు. ఈ ఎగ్జామ్‌కు గాను ఈసారి పంచగయ మీద సిలబస్ ఉంటుందని, దానిననుసరించి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఆవుపాలను తాగడం వల్ల ఉపయోగాలు, ఆవు పేడ, మూత్రం తదితర అంశాలపై పరీక్ష ఉంటుందని అన్నారు.