గ్రహణం ఎదైనా… గ్రహణం పట్టే ముందే ఆలయాలు మూసివేస్తుంటారు. గ్రహణాన్ని అశుభంగా భావించటమే అందుకు కారణం. పురాణాలు, నమ్మకాల ప్రకారం… భూమికి సూర్యుడు జీవదాత. చంద్రుడు చల్లగా ఉంటూ వెలుగులు పంచుతాడు. అలాంటి సూర్యచంద్రులను రాహుకేతువులు మింగడాన్ని అరిష్టం అని నమ్ముతారు. రాహుకేతువులు మింగటం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని, రాహుకేతువులు దుష్టగ్రహాలు కావటం వల్ల వాటి నుండి వచ్చే కిరణాలు ఆలయాలపై పడితే అశుభం అని భావిస్తారు. అందుకే ఆలయాలను మూసివేసి… దర్శనానికి అనుమతించరు. గ్రహణం సమయం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయాలు తెరుస్తారు.
మళ్లీ తెరపైకి సీమ ప్రత్యేక రాష్ట్రం
కానీ ఒక్క గుడి మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. అదే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి టెంపుల్. దక్షిణ కైలాసంగా భావించే ఈ గుడిని గ్రహణం పట్టని దేవాలయంగా పిలుస్తారు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతరత్రా ఎలాంటి కారణం అయినా గుడిని మాత్రం మూసివేయరు. అందుకే సూర్యగ్రహణం సంభవిస్తున్నా… గుడి మాత్రం తెరిచే ఉంటుంది.
పైగా గ్రహణ సమయంలో శ్రీకాళహస్తిశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యచంద్రులు, నవగ్రహలు, అగ్ని ఇలా 27గ్రహలను తనలో నిక్షిప్తం చేసుకొని శ్రీకాళహస్తిశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడని… అందుకే రాహుకేతువులు ఆలయంలోకి ప్రవేశించలేవని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రీకాళహస్తిలోనే రాహు,కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారని, పైగా గ్రహణం రోజే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అక్కడి వారు చెబుతుంటారు.
Advertisements
సినిమాలో సముద్రఖని నటనే హైలెట్?