ఉద్యోగాల భర్తీలో భాగంగా.. మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా తాజాగా ఎక్సైజ్, పోలీస్ రవాణా శాఖలో భర్తీకి విడుదల చేసింది. మొత్తం 677 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్.
ఈ 677 పోస్టుల్లో ఎక్కువగా ఎక్సైజ్ శాఖ నుంచే ఉన్నాయి. 614 పోస్టులు ఎక్సైజ్ శాఖ, 63 పోస్టులు రవాణా శాఖ నుంచి భర్తీ చేయనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్ తదితర వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచారు. యూనిఫాం పోస్టులకు ఈ నోటిఫికేషన్ లోనూ మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు కల్పించింది ప్రభుత్వం.