టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డి పిటిషన్ లో ఈడీ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని కోరింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ కేసులపై పలు కోర్టుల్లో 12 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. రిమాండ్ రిపోర్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లన్నీ ఈడీకి ఇచ్చినట్లు వివరించింది. ఈడీ కోరుతున్న వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలు తమ వద్ద లేవని స్పష్టం చేసింది. అవన్నీ కోర్టులకు సమర్పించామని అఫిడవిట్ లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.