అటు అవినాష్ రెడ్డి అరెస్ట్ పై గత కొన్ని రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పై కూడా టెన్షన్ నెలకొంది. ఇక ఈ రోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణా హైకోర్టు లో విచారణ జరగనుంది. అయితే తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు లోని వెకేషన్ బెంచ్ లో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి కోరడం జరిగింది.
ఈనేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు వెల్లడించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో ఆ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.ఇక ఇలా ఉంటే ఇప్పటికే సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని అవినాష్ సుప్రీం కోర్టును కోరడం జరిగింది.
అయితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తన తల్లి ఆరోగ్యం కుదుటపడే వరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ సుప్రీంకోర్టును కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఇప్పుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆశలన్నీ ముందస్తు బెయిల్ పైనే పెట్టుకున్నారు. మరోవైపు అవినాష్ పిటిషన్ లో సునీత ఇంప్లిడ్ అవ్వనున్నారు.
అవినాష్ కి ముందస్తు బెయిల్ ఇస్తే.. కేసులో జరిగే పరిణామాల పై కోర్టు లో వాదనలు వినిపిస్తామంటున్నారు సీబీఐ ఇంకా సునీత. దీంతో ముందస్తు బెయిల్ పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందని అవినాష్ రెడ్డి పాటు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.