ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని కీలక ప్రకటనలు బయటకు వచ్చాయి. రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో కరోనా మహమ్మారి ముగుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కరోనావైరస్ వ్యాప్తి ఆరు నెలలకు పైగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనావైరస్ వ్యాప్తి ముగిసేలోపు దాదాపు ప్రతి ఒక్కరూ వ్యాధి బారిన పడతారు. ఒకటి కంటే ఎక్కువసార్లు కరోనా బారిన వ్యక్తులు ఉంటారు. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ సలహాదారు మైఖేల్ ఓస్టర్ హోమ్ సంచలన ప్రకటన చేసారు. ఆరు నెలలకు పైగా కరోనా అలాగే ఉంటుంది అనే విషయం అర్ధమవుతుందని ఆ తర్వాత అది వేగంగా పడిపోతుంది అని అభిప్రాయపడ్డారు.
అయితే గత ఏడాది కాలంగా తాను దీన్నే గమనిస్తున్నా అని చెప్పడం గమనార్హం. వ్యాక్సిన్ లు ఇంకా అందుకోలేని బిలియన్ల మంది ప్రజలు ఉన్నారని గమనించాలి అన్నారు. కరోనా అనేది సైలెంట్ విపత్తు అని… అది తగ్గుతుందనే నమ్మకాలు పెట్టుకోవడం కంటే కూడా… ప్రజలు అందరికి వ్యాక్సిన్ అందించడం చాలా మంచిది అని హితవు పలికారు. వ్యాక్సిన్ విషయంలో పెద్ద దేశాల ఆలోచన మారాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. డబ్ల్యూహెచ్‌ఓ సహకార కేంద్రం డెరైక్టర్ కాంత సుబ్బారావు బ్లూమ్‌బర్గ్ తో కొన్ని విషయాలను పంచుకున్నారు. వ్యాపించే శక్తి కరోనాకు ఎక్కువగా ఉందన్నారు ఆయన.