హైదరాబాద్: రాజేంద్రనగర్ శివరాంపల్లి ప్రాంతంలో జరిగిన ఒక పేలుడు ప్రమాదంలో ఒకరు చనిపోయాడు. అక్కడ పుట్‌పాత్‌పై పడి ఉన్నఓ బాక్సును తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన ఆ వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో అతణ్ణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆ డబ్బా చెత్త కుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్ డబ్బా అని పోలీసులు గుర్తించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన యాచకుడు అలీ అని గుర్తించారు. పేలుడుపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డీసీపీ చెప్పారు. ఇది బాంబు బ్లాస్ట్ కాదని, కెమికల్ బ్లాస్ట్ అని తెలిపారు.