పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంభవించి ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్ అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
జైనాథ్ సీహెచ్ పీ సర్పేస్ ఫీడర్ ఎక్సనెంజర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ పేలింది. ప్రమాదంలో కొత్తగూడెం మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన జైనాథ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు.
అతడికి భార్య ,కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుండెపోటుతో మరో కార్మికుడు మరణించాడు. ఓసీపీ త్రీ ఆర్జీ 2 ఏరియాలో ఈపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న పల్లెనేని ప్రకాష్ రావు అనే కార్మికుడు గుండెపోటుతో మరణించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆయన రాత్రి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా డిన్నర్ బ్రేక్ లో నిద్రపోయాడు. అతడికి నిద్రలోనే గుండెపోటు రావపోవడంతో మృతి చెందాడు.
సంఘటన విషయం తెలుసుకున్న ఆర్జీ 2 వైస్ ప్రెసిడెంట్ బలి శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకులు కొంగ రవీందర్, బేతి చంద్రయ్య,బుద్దుల నరసయ్య మామిడి తిరుపతి ఆకుల రాజయ్య తోకల సమ్మయ్య ఓసీపీ త్రీ అధికారులు డిస్పెన్సరీకి వచ్చి మృతదేహాన్ని సందర్శించారు.