నువ్వానేనా అన్నట్టు జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ భీకర యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆ దేశాల సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో వాణిజ్య పరంగా అన్ని దేశాలపై ప్రభావం పడుతోంది. ఏదైనా దేశంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు దాని ప్రభావం ఎగుమతులు, దిగుమతులపై చూపుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురవడంతో పాటు.. కొన్ని వస్తువుల ధరలు పెరగడం లాంటివి చోటుచేసుకుంటాయి.
అందులో భాగంగానే మధ్యం ధరలు పెరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మందుబాబులకు షాక్ తగలనుందా..? బీర్ల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. బీర్ల తయారీలో బార్లీ ఉపయోగిస్తారు. ఉక్రెయిన్ దేశంలో బార్లీ ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది.
యుద్ధం వాతావరణం నెలకొనడం వల్ల బార్లీ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. దీని వల్ల బార్లీకి డిమాండ్ ఎక్కువై వాటి ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు చేప్తున్నారు. దీంతో బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే మందు బాబులకు షాక్ తగిలినట్టే అవుతోందంటున్నారు.