బట్టలు ఉతకని పక్షంలో గ్రామం విడిచి వెళ్లాలని గ్రామ పెద్దలు హుకుం జారీ చేసిన సంఘటన కర్నూల్ జిల్లా గొనెగండ్ల మండలం వేముగొడులో చోటు చేసుకుంది. గ్రామంలో పాలు, నీళ్లు, నిత్యవసర వస్తువులు అమ్మకూడదని ఆంక్షలు పెట్టారు.కులవృత్తిని వదిలేసి ఆరేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామంటూ రజక కుటుంబాలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని పోలీస్ లను ఆశ్రయించారు.