పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన బాధ్యతగల టీచర్లే దారి తప్పి ప్రవర్తించారు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలి భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధీ చేయడమే కాకుండా గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లుగా పనిచేస్తున్న కుక్కల నాగేందర్, ఈసం లావణ్యలు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.
లావణ్య భర్త సాంబయ్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గతేడాది ఓ మారు ఈ విషయం గురించి సాంబయ్య ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేయగా ఆమె వారిని మందలించారు. అయినప్పటికీ వారు తమ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే లావణ్యను డిప్యూటేషన్ పై వేరే చోటుకి బదిలీ చేశారు.
కానీ లావణ్య నాగేందర్ తమ రహస్యబంధాన్ని కొనసాగిస్తున్నారు. శివరాత్రి బందోబస్తుకు హాజరై ఇంటికి వచ్చిన సాంబయ్య భార్య ఫోన్ చూస్తుండగా ఎప్పటి లాగానే నాగేందర్ లావణ్యకి కాల్ చేసి వస్తున్నట్లు తెలిపి తలుపు తీసి ఉంచమన్నాడు. విషయం తెలిసిన సాంబయ్య భార్యను ఒక గదిలో ఉంచి తాళం వేసి తాను మరో గదిలో దాక్కుని నాగేందర్ ని లోనికి రానిచ్చిన తరువాత తాళం పెట్టి బంధువులకు, చుట్టు పక్కల వారికి తెలిపాడు.
వారంతా కలిసి ఇద్దరికి దేహశుద్ధి చేసి గ్రామంలో ఊరేగించారు. ఆ తరువాత ఇద్దరినీ కలిపి పోలీసులకు అప్పగించారు. నాగేందర్ భార్య చాలా కాలం క్రితమే అతన్ని వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం.