తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేడు సాయంత్రం సమావేశం కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నాయకులతో ఆయన చర్చించనున్నారు.
వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై నాయకులతో కలిసి ఆయన మేధోమథనం చేయనున్నట్టు సమాచారం. ధాన్యం సేకరణ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ సమావేశాన్ని రాహుల్ గాంధీ నివాసంలో నిర్వహించనున్నారు. గత వారం రోజుల్లో తెలంగాణ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించడం ఇది రెండవ సారి కావడం గమనార్హం.
Advertisements
తెలంగాణ నాయకులతో ఆయన గత బుధవారం తన నివాసంలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు, డిజిటల్ సభ్యత్వ నమోదు అంశంపై చర్చించినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి.