అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వేసవి కానుకగా మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యం తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం కూడా ఉంది.. అదే డబ్బు’ అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే, ‘మనీ.. ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్టేషన్’ అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తితో ఇబ్బంది పడే యువకుడిగా వరుణ్ తేజ్ సినిమాలో కనిపిస్తున్నారు. ‘వారిది మరాఠీ ఫ్యామిలీ ఐతే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’ అంటూ వెంకటేష్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రగతి, సునీల్, వెన్నెలకిషోర్‌తో పాటు ప్రతి పాత్ర వినోదాన్ని పంచుతూ ట్రైలర్లో సందడిచేశాయి. డబ్బు వల్ల ఎదురయ్యే కష్టాలను వినోదాత్మకంగా ట్రైలర్లో చూపించారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జంటగా మెహరీన్ నటించారు. సోనాల్ చౌహన్ ప్రత్యేక పాత్రలో, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటించారు. దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.