వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా సక్సెస్ ఫుల్ గా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈవారం రోజుల్లో సినిమా దాదాపు 70శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 85 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల రూపాయలు రాబట్టింది. షేర్ పరంగా చూసుకుంటే.. ఈ 7 రోజుల్లో ఎఫ్3 సినిమాకు 38 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 63 కోట్ల రూపాయలకు అమ్మారు. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వారం కూడా సినిమా గట్టిగా ఆడాల్సిందే. లేదంటే నష్టాలు తప్పవు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అయినప్పటికీ, ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు.
ఏపీ, నైజాంలో ఎఫ్3 సినిమాకు ఈ వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం : 16.40 కోట్లు
సీడెడ్ : 5.38 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.18 కోట్లు
ఈస్ట్ : 2.86 కోట్లు
వెస్ట్ : 2.10 కోట్లు
గుంటూరు : 2.82 కోట్లు
కృష్ణా : 2.48 కోట్లు
నెల్లూరు : 1.55 కోట్లు