వర్కింగ్ డేస్ మొదలవ్వడం వల్ల ఎఫ్3 సినిమాకు వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ కలెక్షన్లలో భారీ తగ్గుదల మాత్రం కనిపించలేదు. సోమవారం 4 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా, మంగళవారం 3 కోట్ల రూపాయల రాబట్టింది. అలా తెలుగు రాష్ట్రాల్లో తన కౌంట్ ను 35 కోట్ల 7 లక్షల రూపాయలకు చేర్చుకుంది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
తాజా వసూళ్లతో ఎఫ్3 సినిమా తెలుగు రాష్ట్రాల్లో సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. మిగతా సగం బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి ఎంటర్ అవ్వాలంటే, ఈ సినిమా రాబోయే వారాంతం కూడా మంచి వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
మరోవైపు యూనిట్ మాత్రం తమ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. వెంకీ, వరుణ్, రావిపూడి.. రకరకాల ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటితో 5 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు, ఏపీ-నైజాం లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 15.20 కోట్లు
సీడెడ్ – రూ. 4.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.53 కోట్లు
ఈస్ట్ – రూ. 2.43 కోట్లు
వెస్ట్ – రూ. 1.90 కోట్లు
గుంటూరు – రూ. 2.56 కోట్లు
నెల్లూరు – రూ. 1.39 కోట్లు
కృష్ణా – రూ. 2.26 కోట్లు